- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. ఏన్కూర్ మండల ఇన్‌చార్జి ఎంఈవోగా వాసవి దేవి నియామకం
by Jakkula.Mamatha |
‘ఏన్కూర్ మండలానికి విద్యాశాఖ అధికారిని నియమిచండి కలెక్టర్ సార్’ అని ‘దిశ’ పేపర్ లో వార్త కథనం వెలువడింది.

X
దిశ,ఏన్కూర్: ‘ఏన్కూర్ మండలానికి విద్యాశాఖ అధికారిని నియమిచండి కలెక్టర్ సార్’ అని ‘దిశ’ పేపర్ లో వార్త కథనం వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న వాసవి దేవిని ఇన్‌చార్జి మండల విద్యాశాఖ అధికారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ మేరకు పూర్వపు విద్యాశాఖ అధికారి, నాగిరెడ్డి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. వాసవి దేవి గతంలో కూడా ఎంఈవోగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హరిత, లత తదితరులు ఉన్నారు.
Next Story






