బీఎల్ఓలు బాధ్యతతో పని చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్

by Jakkula.Mamatha |

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బీఎల్ఓలుగా సూపర్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన వారు బాధ్యతతో పని చేయాలని వైరా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.

బీఎల్ఓలు బాధ్యతతో పని చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్
X

దిశ, ఏన్కూర్: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బీఎల్ఓలుగా సూపర్వైజర్‌గా బాధ్యతలు చేపట్టిన వారు బాధ్యతతో పని చేయాలని వైరా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. గురువారం ఏన్కూర్ రైతు వేదిక నందు ఏన్కూర్ జూలూరుపాడు మండలాల బీఎల్ఓలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యాపుడు, అన్ మ్యాపుడు, ఆనామలిష్, తదితర వాటిపై బీఎల్ఓలకు, సూపర్వైజర్‌లకు, ఏఈఆర్‌వోలకు, అవగాహన కల్పించి, బాధ్యతగా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతి బిఎల్ఓ ఒక వాలంటరీని ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ఏ చిన్న తప్పు జరిగిన ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఏన్కూర్ తహసీల్దార్ సీహెచ్ శేషగిరిరావు, జూలూరుపాడు ఎమ్మార్వో, టి.శ్రీనివాసరావు, ఏన్కూరు ఎంపీఓ, జీవీఎస్, నారాయణ, తదితరులు ఉన్నారు.

Next Story