- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు.. అదంతా అవాస్తవం: మాజీ మంత్రి కారుమూరి
‘‘నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు.. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నా.. ఆ వార్తలన్ని అవాస్తవం.’’ అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు....

X
దిశ, వెబ్ డెస్క్: ‘‘నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు.. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నా.. ఆ వార్తలన్ని అవాస్తవం.’’ అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మద్యం రవాణా కాంట్రాక్టు, టెండర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్పందించారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని ప్రకటన విడుదల చేశారు.
కాగా ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల ఇళ్లలో ఈ రోజు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు జరిగాయి. అంతేకాదు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సైతం అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయన స్పందించి అరెస్ట్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
Next Story






