- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: బిర్యానీలో చచ్చిన ఈగ.. వినియోగదారుల కోర్టు వింత తీర్పు
పుదుచ్చేరిలో ఆర్డర్ చేసిన బిర్యానీలో చచ్చిన ఈగ వచ్చినందుకు హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల కోర్టు షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: బిర్యానీలో చచ్చిన ఈగ వచ్చినందుకు ఓ హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల కోర్టు ఊహించని షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8న పుదుచ్చేరిలోని ఎంజీ రోడ్డు (MG Road)లో ఉన్న బిర్యానీ అండ్ కో హోటల్‌కు సుందరకుమార మణికందన్ (Sundara Kumar Manikandan) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అయితే, వారు ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ తింటుండగా అందులో ఒక చచ్చిన ఈగ కనిపించింది. మణికందన్ వెంటనే అప్రమత్తమై, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా రికార్డ్ చేసుకున్నాడు.
ఇదేంటని ప్రశ్నించగా.. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మణికందన్ తనను మానసిక క్షోభకు గురిచేసినందుకు గాను రూ.1,30,000 పరిహారం కావాలని జిల్లా వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వింత తీర్పును వెలువరించారు. బాధితుడు సుందరకుమార మణికందన్‌కు రూ.10 వేల పరిహారంతో పాటు 5 వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున మొత్తం 10 ప్లేట్ల ఉచిత బిర్యానీ ఇవ్వాలంటూ బిర్యానీ అండ్ కో హోటల్‌కు ఆదేశాలు జారీ చేశారు.






