అంబేద్కర్ విగ్రహం చుట్టూ గులాబీ జెండాల కలకలం!

by Kodari Anjali |

అంబేద్కర్ విగ్రహం చుట్టూ గులాబీ జెండాలను, తోరణాలను కట్టడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంబేద్కర్ విగ్రహం చుట్టూ గులాబీ జెండాల కలకలం!
X

దిశ, గంగాధర: మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఒక రాజకీయ పార్టీకి (బీఆర్ఎస్) సంబంధించిన గులాబీ జెండాలను, తోరణాలను కట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదంతంపై దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, బహుజన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఒక పార్టీ కార్యక్రమం పురస్కరించుకుని కొందరు ఉత్సాహవంతులైన రాజకీయ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహ పరిసరాలను పూర్తిగా తమ పార్టీ జెండాలతో నింపేశారు. విగ్రహం చుట్టూ ఉన్న గ్రిల్స్‌కు, బేస్‌మెంట్‌కు పార్టీ జెండాలు కట్టడమే కాకుండా, విగ్రహానికి అతి సమీపంలో తోరణాలు వేలాడదీశారు. విశ్వమానవుడిగా, దేశానికే గర్వకారణంగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తి విగ్రహానికి ఇలా ఒకే పార్టీ రంగులను పులుముతూ జెండాలు కట్టడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

Next Story