- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : క్యాన్సర్ చికిత్సలో పురోగతి.. అందుబాటులోకి మరో ఇంజెక్షన్ !
లంగ్ క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పుడు కొత్త ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. సాంప్రదాయిక ఐవీ చికిత్సకంటే ఇది చాలా మెరుగైనదని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అయితే ఒకప్పటిలా ఈ విషయంలో భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొత్త కొత్త చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో మరో పురోగతి ఏర్పడింది. ఏంటంటే.. భారతదేశంలో టెసెంట్రిక్ ఎస్‌సి(Tecentriq SC) అనే సబ్‌క్యుటేనియస్ (చర్మం కింద) ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇది రోచెస్ కంపెనీ అభివృద్ధి చేసిన ఏటిజోలిజుమాబ్ (Atezolizumab) ఆధారిత మెడిసిన్.
85% క్యాన్సర్ కేసులు అవే..
ముఖ్యంగా టెసెంట్రిక్ ఎస్‌సి ఇంజెక్షన్ కేవలం నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కోసం ఆమోదం పొందింది. లంగ్ క్యాన్సర్ కేసుల్లో సుమారు 85% ఈ రకమైనవే ఉంటున్నాయి. ఈ ఇంజెక్షన్ ప్రత్యేకత ఏమిటంటే.. సాంప్రదాయిక ఐవీ (నాళం ద్వారా) చికిత్సకు ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పడితే.. ఈ ఇంజెక్షన్ కేవలం 7 నిమిషాల్లో పూర్తి అవుతుంది. 2026 మే 15న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదంతో రోచెస్ కంపెనీ దీనిని లాంచ్ చేసింది.
సవాళ్లతోపాటు సౌకర్యం కూడా..
టెసెంట్రిక్ ఎస్‌సి డ్రగ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కనబడకుండా చర్మంకింద ఉండిపోయిన క్యాన్సర్ కణాలను సైతం ఇమ్యూన్ సిస్టమ్ ముందు బయటపెడుతుంది. తద్వారా శరీరాన్ని సహజంగానే క్యాన్సర్‌తో పోరాడేలా చేస్తుంది. ఈ చికిత్సలో ఆస్పత్రులు ఒకే సమయంలో 5 రెట్లు ఎక్కువ మంది రోగులకు ట్రీట్మెంట్ అందించవచ్చు. దీంతో సమయం, అసౌకరర్యం తగ్గించడంతోపాటు ఆస్పత్రి వనరులను మెరుగు పరుస్తుంది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఏమిటంటే ఈ ఇంజెక్షన్ ఒక్కడోస్ ధర సుమారు రూ. ₹3.7 లక్షలు. ఇది అనేకమంది భారతీయ రోగులకు ఆర్థిక భారంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ వేగవంతమైన, సౌకర్యవంతమైన చికిత్సా పద్ధతి లంగ్ క్యాన్సర్ రోగుల్లో్ కొత్త ఆశలు రేపుతోంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






