- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్ చెప్పిన చిన్న మార్పు.. రిజల్ట్ చూసి షాక్ అయిన మేకర్స్
కథ మొత్తం విన్న తర్వాత వెంకటేష్ సూచనతోనే ‘నువ్వు నాకు నచ్చావ్’లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌ను రాసినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: దాదాపు చాలామంది హీరోలు దర్శకుడు లేదా కథ రచయిత కథను వినిపించిన తర్వాత తమకు అనిపించిన విషయాలను చెప్పడం, వాటి ఆధారంగా కథలో మార్పులు చేర్పులు జరగడం సర్వసాధారణం. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో వెంకటేష్ సూచించిన ఒక చిన్న మార్పు మూవీ విజయానికి కీలకంగా మారిందని తెలుస్తోంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ కథ మొత్తం విన్న తర్వాత వెంకటేష్, “కథ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో సాగుతుంది. అది ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది. ఆ విషయంపై ఒకసారి ఆలోచించండి” అని సూచించారట. దాంతో మేకర్స్ కూడా వెంకటేష్ చెప్పింది నిజమేనని భావించి, సెకండ్ హాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేశారట. అప్పుడే మిస్టర్ బీన్ పాత్ర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌ను రూపొందించారట.
ఈ చిత్రంలోని బ్రహ్మానందం ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. వెంకటేష్ కథ విన్న సమయంలో చెప్పిన ఆ చిన్న సూచనే సినిమా విజయాన్ని మరింత పెంచిందని మూవీ బృందం భావించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. శ్రీ స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.






