ప్రధాని మోదీ అధ్యక్షతన ‘నీతి ఆయోగ్’ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

by Malleboina Mahesh |

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

ప్రధాని మోదీ అధ్యక్షతన ‘నీతి ఆయోగ్’ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (Governing Council Meeting) ప్రారంభమైంది. దేశ ప్రగతిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ సమావేశం కొనసాగుతోంది. "టీమ్ ఇండియా" స్ఫూర్తితో, సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పరమావధిగా.. ఈ ఏడాది సమావేశాన్ని “వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ వికాసం” అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.

ఈ హై ప్రొఫైల్ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లింగ, ప్రాంతీయ, సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సరైన పోషకాహారం, భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.

Next Story