బడా వజ్రాల వ్యాపారి కిడ్నాప్.. రూ. 100 కోట్లు డిమాండ్

by Muthe.Rajitha |

ఆఫ్రికా దేశమైన మాలిలో గుజరాత్‌కు చెందిన భారత సంతతి వజ్రాల వ్యాపారవేత్త ధీరు రమానీ (75) కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బడా వజ్రాల వ్యాపారి కిడ్నాప్.. రూ. 100 కోట్లు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికా దేశమైన మాలిలో గుజరాత్‌కు చెందిన భారత సంతతి వజ్రాల వ్యాపారవేత్త ధీరు రమానీ (75) కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివాసముంటూ అంతర్జాతీయంగా వ్యాపారం చేసే రమానీ కుటుంబం, రెండేళ్ల క్రితం బంగారు గనుల రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో మాలిలోని ఒక గని పనులను పర్యవేక్షిస్తున్న రమానీని ఈ ఏడాది ఏప్రిల్‌లో దుండగులు అపహరించారు.

దాదాపు మూడు నెలల పాటు నిర్బంధంలో ఉంచిన కిడ్నాపర్లు, మొదట రూ. 100 కోట్లు డిమాండ్ చేశారు. అయితే, వీడియో కాల్ ద్వారా రమానీ క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు సుదీర్ఘ చర్చల అనంతరం 4 మిలియన్ యూరోలు (రూ. 44 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించారు. నగదు చెల్లించడంతో రమానీతో పాటు ఆయనతో ఉన్న వంట మనిషి, ఎలక్ట్రీషియన్‌ను దుండగులు ఇటీవల విడిచిపెట్టారు.

ఈ కిడ్నాప్ వ్యవహారంలో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, కుటుంబ సభ్యులే నేరుగా చర్చలు జరిపి ఆయనను విడిపించినట్లు తెలిసింది. విడుదల అనంతరం స్థానిక పోలీసులు రమానీని విచారించారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలోనే మాలిలోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

Next Story