- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లేస్టోర్‌లో ఫేక్ యాప్.. గూగుల్ ఇండియా అధిపతిపై కేసు
ప్లేస్టోర్ లో నకిలీ యాప్ వల్ల తాను నష్టపోయానని ఓ వ్యక్తి గూగుల్ ఇండియా హెడ్ మీద ఫిర్యాదు చేసాడు.

దిశ, వెబ్ డెస్క్ : గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న ఒక నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ ద్వారా తాను రూ. 7.95 లక్షలు నష్టపోయానని, బ్యాక్ చెకింగ్ లేకుండా ఇలాంటి మోసపూరిత యాప్‌లకు అనుమతినిచ్చిన గూగుల్ ఇండియా నోడల్ హెడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల బీడీఎల్ (BDL) ఉద్యోగికి మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ పేరుతో వాట్సప్‌లో సందేశం రాగా, అందులోని సభ్యులు స్టాక్ మార్కెట్ సలహాల పేరుతో ఆయనను నమ్మించి గూగుల్ ప్లేస్టోర్ నుంచి 'జీవీఎస్ ఇన్‌స్టిట్యూషన్' అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమవుతున్న యాప్ కాబట్టి సురక్షితమైనదేనని నమ్మిన సదరు ఉద్యోగి, ఈ నెల 10 నుంచి 26వ తేదీ మధ్య మొత్తం రూ. 7.95 లక్షలు పెట్టుబడి పెట్టారు. యాప్‌లో ఆయన పెట్టుబడికి రూ. 27.75 లక్షల లాభం వచ్చినట్లు చూపించినప్పటికీ, ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు నిర్వాహకులు నిరాకరించారు. పైగా పన్నుల రూపంలో అదనంగా రూ. 9.26 లక్షలు చెల్లిస్తేనే డబ్బులు విత్‌డ్రా అవుతాయని కండిషన్ పెట్టడంతో తాను తీవ్రంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ యాప్‌ను ప్లాట్‌ఫామ్‌పై ఉంచిన గూగుల్ ఇండియా యాజమాన్యం నిర్లక్ష్యంపై, అలాగే మోసానికి పాల్పడిన సైబర్ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.






