దేశభక్తులు అంధభక్తులను ఓడించారు : ఉద్ధవ్ ఠాక్రే

by Muthe.Rajitha |

నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘనంగా ప్రశంసించారు.

దేశభక్తులు అంధభక్తులను ఓడించారు : ఉద్ధవ్ ఠాక్రే
X

దిశ, వెబ్ డెస్క్ : నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘనంగా ప్రశంసించారు. ఈ పోరాటం కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి (BJP) వ్యతిరేకంగా జరగబోయే పెద్ద ఉద్యమానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు. ముంబయిలోని చారిత్రాత్మక శివాజీ పార్కులో ఘనంగా నిర్వహించిన ‘తిరంగా’ ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత చేతుల్లో జాతీయ పతాకాలు, భారత రాజ్యాంగ ప్రతులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. "ఈ దేశంలో ఓట్లను దొంగిలించవచ్చు కానీ, దేశ ప్రజలను కాదని ప్రధాని మోడీకి విద్యార్థులు తమ పోరాటంతో స్పష్టంగా నిరూపించారు. నిజమైన దేశభక్తులు అంధభక్తులను ఓడించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా దేశంపై, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, ఇతర రాజకీయ పార్టీలను చీల్చే పనులకు స్వస్తి చెప్పి, మంత్రులంతా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేలా చూడాలని ఆయన సూచించారు.

Next Story