జాతీయ అవార్డు వివాదంపై ధనుష్ స్పందన.. వీరంతా అప్పుడెక్కడికి పోయారు

by Pulgam srinivas |

'మేయళగన్', 'మహారాజా' చిత్రాలు 'రాయన్' కంటే మెరుగైనవేనని ధనుష్ స్వయంగా అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది.

జాతీయ అవార్డు వివాదంపై ధనుష్ స్పందన.. వీరంతా అప్పుడెక్కడికి పోయారు
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన ధనుష్ కొంతకాలం క్రితం 'రాయన్' చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, ఆ చిత్రానికి స్వీయ దర్శకత్వం కూడా వహించారు. ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రం విభాగంలో అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డుపై కోలీవుడ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది 'రాయన్' సాధారణ చిత్రమేనని, అదే ఏడాది విడుదలైన 'మేయళగన్', 'మహారాజా' వంటి చిత్రాలు దీనికంటే మెరుగైనవని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్ జాతీయ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... 'మేయళగన్', 'మహారాజా' సినిమాలు 'రాయన్' కంటే మెరుగైనవే. కానీ నా 'పుదుపెట్టై', 'వడ చెన్నై', 'కర్ణన్', 'మారియన్', 'రాంఝనా' వంటి చిత్రాలకు జాతీయ అవార్డులు రానప్పుడు కనీసం 10 శాతం మంది కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం నా అవార్డును 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story