8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్

by Muthe.Rajitha |

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) విజయవంతంగా 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు.

8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) విజయవంతంగా 8 నెలల పాటు గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. నాసాకు చెందిన వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగాములు సెర్గీ కుద్‌ స్వెర్చ్‌కోవ్, సెర్గీ మికాయెవ్‌లు సోయుజ్ ఎమ్ఎస్-28 (Soyuz MS-28) వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని స్టెప్పీస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్‌క్రాఫ్ట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన చివరి దశలో పారాచూట్లు సక్రమంగా విచ్చుకోవడంతో వ్యోమనౌక ఎలాంటి ప్రమాదం లేకుండా సాఫీగా కిందకు దిగింది. వ్యోమగాముల్లో నాసాకు చెందిన క్రిస్ విలియమ్స్, రష్యాకు చెందిన సెర్గీ మికాయెవ్‌లకు ఇది తొలి అంతరిక్ష యాత్ర కాగా, సెర్గీ కుద్‌ స్వెర్చ్‌కోవ్‌కు ఇది రెండో అంతరిక్ష యాత్ర కావడం విశేషం. ల్యాండింగ్ అనంతరం వైద్య బృందం వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని నిర్ధారించారు.

Next Story