చైనాలో 'నౌల్‌' తుపాను బీభత్సం

by Muthe.Rajitha |

చైనాను తీవ్రమైన 'నౌల్' (Noul) తుపాను అతలాకుతలం చేస్తోంది.

చైనాలో నౌల్‌ తుపాను బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాను తీవ్రమైన 'నౌల్' (Noul) తుపాను అతలాకుతలం చేస్తోంది. ఇటీవల సంభవించిన 'బావి' తుపాను కంటే ఇది అత్యంత శక్తిమంతమైనదని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల తుఫాను ప్రభావిత ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ తుపాను తీవ్రత కారణంగా గంటకు ఏకంగా 162 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో వినాశకర పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను ధాటికి గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు హైస్పీడ్ రైలు సేవలను, విమాన సర్వీసులను రద్దు చేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విపరీతమైన ఈదురుగాలులు, ఊహించని వరదల కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుండగా, ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.

Next Story