- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్
NEET పరీక్ష వివాదంలో విద్యార్థులకు మద్దతుగా చేపట్టిన సుదీర్ఘ నిరాహార దీక్ష అనంతరం ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : NEET పరీక్ష వివాదంలో విద్యార్థులకు మద్దతుగా చేపట్టిన సుదీర్ఘ నిరాహార దీక్ష అనంతరం ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నీట్ నిరసనకారులకు మద్దతుగా సీజేపీ చేపట్టిన ఆందోళనలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చుక్ ఏకధాటిగా 26 రోజుల పాటు కఠిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రావడం, సీజేపీ, విద్యార్థులు ఆందోళన విరమించడంతో శుక్రవారం ఆయన తన దీక్షను విరమించారు.
సుదీర్ఘ దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడానికి వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి నేరుగా డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను (Rajghat) సందర్శించనున్నారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద సత్యగ్రహ పద్ధతిలో సాగించిన తన పోరాటానికి శాంతియుత ముగింపుగా నివాళులర్పించిన తర్వాత, ఆయన సొంత ప్రాంతమైన లద్దాఖ్‌కు తిరుగు పయనమవుతారని ఆయన ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.






