- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
రానున్న సోమ, మంగళవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : రానున్న సోమ, మంగళవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలిలో తేమ శాతం ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణంతో అల్లాడిపోతున్నారు. సాయంత్రం వేళల్లో అక్కడక్కడా పడుతున్న వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, పగటివేళ మాత్రం వేడి సెగలు కొనసాగుతుండటంతో నగరవాసులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో భారీ వానలు కురిసాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో అత్యధికంగా 76.8 మి.మీ వర్షపాతం నమోదైంది.






