AI సహాయంతో నాసా శనిగ్రహంపై రీసెర్చ్!

by Muthe.Rajitha |

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్టు సమాచారం.

AI సహాయంతో నాసా శనిగ్రహంపై రీసెర్చ్!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్టు సమాచారం. శనిగ్రహం (Saturn), దాని చుట్టూ ఉన్న వలయాల (Rings) మీద పరిశోధనల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది.

నాసా పరిశోధనలివే

శనిగ్రహం చుట్టూ ఉన్న ప్రసిద్ధ వలయాల (Rings) నుంచి కణాలను (Particles) సేకరించేందుకు నాసా AI-ఆధారిత 'ప్రాక్సిస్' (PRAXIS) రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగాన్ని సిద్ధం చేస్తోంది. శనిగ్రహపు వలయాల నుంచి నమూనాలను సేకరించడం అంతరిక్ష చరిత్రలోనే ఇది తొలిసారి కానుంది. భూమి నుంచి నియంత్రణ సంకేతాలు వెళ్లడానికి సమయం పడుతుంది కాబట్టి, రోవర్ లేదా రోబోలు అక్కడికక్కడే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని అంతరిక్ష వ్యర్థాల నుంచి సురక్షితంగా నమూనాలను సేకరించడానికి ఏఐ అల్గారిథమ్‌లు సహాయపడతాయి. అలాగే శనిగ్రహం చుట్టూ తిరిగే పదుల సంఖ్యలోని చిన్న చిన్న ఉపగ్రహాలను, ఆస్టరాయిడ్లను గుర్తించడంలో నాసా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. టెలీస్కోప్ ద్వారా లభించే భారీ స్థాయి డేటాను విశ్లేషించి, అతి చిన్న ఖగోళ వస్తువులను వేగంగా గుర్తించడంలో ఏఐ ఇప్పటికే విజయం సాధించింది.

'టైటాన్' మీద జీవజాలం!

మరోవైపు శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహమైన 'టైటాన్' (Titan) పై జీవజాలం ఉనికిని అన్వేషించడానికి నాసా డ్రాగన్‌ఫ్లై హెలికాప్టర్ మిషన్‌ను రూపొందిస్తోంది. టైటాన్ ఉపరితలంపై ఏఐ సహాయంతోనే ఈ రోవర్ ప్రయాణిస్తూ, అక్కడి వాతావరణం, రసాయన మూలకాల డేటాను విశ్లేషిస్తుంది. శనిగ్రహంతో పాటు యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల చుట్టూ ఉండే వలయాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవడానికి ఏఐ సిమ్యులేషన్స్ నాసా శాస్త్రవేత్తలకు ఎంతో తోడ్పడుతున్నాయని అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి.

Next Story