డీఎస్సీలో అవకతవకలు షాకింగ్‌గా ఉన్నాయి : వైఎస్ జగన్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-11 06:21:13  IST  )

డీఎస్సీలో ఎన్నో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. అవ‌క‌త‌వ‌క‌లు షాకింగ్ గా ఉన్నాయ‌ని అన్నారు. ల‌క్ష‌ల మంది న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశార‌ని మండిప‌డ్డారు. డీఎస్సీలో స్కాముల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు.

డీఎస్సీలో అవకతవకలు షాకింగ్‌గా ఉన్నాయి : వైఎస్ జగన్
X

దిశ‌, వెబ్ డెస్క్: డీఎస్సీలో ఎన్నో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. అవ‌క‌త‌వ‌క‌లు షాకింగ్ గా ఉన్నాయ‌ని అన్నారు. ల‌క్ష‌ల మంది న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేశార‌ని మండిప‌డ్డారు. డీఎస్సీలో స్కాముల‌కు పాల్ప‌డ్డార‌ని అన్నారు. తామే 6100 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ ఇచ్చామ‌ని, ఆ త‌ర‌వాత 16వేల పోస్టుల‌తో నోటిఫికేష‌న్ ఇచ్చి పోస్టుల‌ భ‌ర్తీ ఆల‌స్యం చేశార‌ని చెప్పారు. న‌వీన్ అనే వ‌క్తి ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌టం, అత‌డికి టాప్ ర్యాంక్ రావ‌డం స్కామ్ కాదా అని ప్ర‌శ్నించారు. నిజంగా అత‌డు టాప‌ర్ అయితే ఎందుకు ఉద్యోగం ఇవ్వ‌లేద‌ని అడిగారు.

త‌న డీఎస్సీ ఐడీ బ్లాక్ అయ్యింద‌ని నవీన్ విద్యాశాఖ‌కు మెయిల్ చేశాడ‌ని చెప్పారు. ఏ పేప‌ర్ త‌యారీ అయినా, ప్ర‌శ్న‌ల త‌యారీ డిజిట‌లైజ్ అనేది ర‌హ‌స్యంగా జ‌ర‌గాల‌న్నారు. ప్ర‌భుత్వాన్ని త‌ప్పు బ‌ట్ట‌కుండా ఐడీనే మాయం చేశార‌ని ఆరోపించారు. కలెక్టర్ దగ్గర కూడా మెరిట్ లిస్ట్, డేటా లేవని అన్నారు. ఫ‌స్ట్ ర్యాంక్ వ్య‌క్తి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కు రాక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న‌కు ఉద్యోగం ఇవ్వ‌లేద‌ని అంటున్నార‌ని, మ‌రి ఆయ‌న అదే ఉద్యోగం కోసం కోర్టుకు ఎందుకు వెళ్లాడ‌ని ప్ర‌శ్నించారు. డీఎస్సీలో అక్ర‌మాల‌తో ప్ర‌తిభావంతుల జీవితాల‌ను దారుణంగా దెబ్బ‌తీశార‌ని అన్నారు. అధికారం వ‌చ్చాక తొలి సంత‌కం పేరుతోనే డ్రామాలు చేశార‌ని మండిప‌డ్డారు.

Next Story