- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సీన్స్
ఈ శనివారం నుంచి ‘పెద్ది’ సినిమా సెకండాఫ్‌లో వచ్చే సిసోడియా సన్నివేశాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను జోడించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. విడుదల అనంతరం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, కొన్ని సన్నివేశాల విషయంలో ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ గ్లామర్ ప్రెజెంటేషన్‌పై కొంతమంది నెగిటివ్‌గా స్పందించారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందించి, ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ‘పెద్ది’ సినిమాలో మరికొన్ని మార్పులు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ శనివారం నుంచి ‘పెద్ది’ సినిమా రన్‌టైమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సిసోడియా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను జోడించనున్నట్లు సమాచారం. ఈ మార్పులు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






