- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్య 50వ సినిమా కోసం రంగంలోకి దిగిన అనిల్ రావిపూడి
సూర్య 50వ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూర్య తాజాగా ‘కరుప్పు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే తన 47వ సినిమాను జీతూ మాధవన్ తెరకెక్కించనుండగా, పా. రంజిత్, టి.జె. జ్ఞానవేల్ కూడా ఆయన లైనప్‌లో ఉన్నారు. దీంతో సూర్య 50వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే అంశం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. తాజాగా సూర్య 50వ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశమున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అన్ని అనుకూలిస్తే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. నిజంగానే సూర్య - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా వస్తే దానిపై భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






