సీఎం సహాయ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లారెడ్డి

by Batti.Sumithra |

సీఎం సహాయ నిధులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.

సీఎం సహాయ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లారెడ్డి
X

దిశ, ఘట్కేసర్ : సీఎం సహాయ నిధులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘట్కేసర్ కు చెందిన జస్వంత్ ముదిరాజ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొందుతున్నందున సీఎం సహాయ నిధి రూ.2,75,000/- ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు బిజిలి సదానందం, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story