- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిటీల ఎంపికలో దళితులకు అన్యాయం: ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు
by Kodari Anjali |
దళిత నాయకుడి పేరు కూడా లేకపోవడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు పోతగల్ల శ్రీనివాస్ అన్నారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్ష పదవులకు ఇటీవల ప్రకటించిన జాబితాలో ఒక్క దళిత నాయకుడి పేరు కూడా లేకపోవడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు పోతగల్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడానికి కీలకపాత్ర పోషించింది దళిత నాయకులే అని గుర్తు చేశారు. గెలుపుకు కృషి చేసిన దళితులపై స్థానిక ఎమ్మెల్యే చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే రాబోయే ఎన్నికలలో దళితులు కాంగ్రెస్ పార్టీకి దూరమవ్వడం ఖాయమని హెచ్చరించారు.
Next Story






