రూట్ మ్యాప్ తప్పుదోవ.. మట్టి గుంతల రోడ్డు వైపు మళ్లుతున్న వాహనాలు!

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు, రేగళ్ళ మధ్య రహదారి సుమారు 12 కిలోమీటర్లు మట్టి రహదారి గుంతలతో ఉంటుంది.

రూట్ మ్యాప్ తప్పుదోవ.. మట్టి గుంతల రోడ్డు వైపు మళ్లుతున్న వాహనాలు!
X

దిశ, ఆళ్లపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు, రేగళ్ళ మధ్య రహదారి సుమారు 12 కిలోమీటర్లు మట్టి రహదారి గుంతలతో ఉంటుంది. గూగుల్/జియో రూట్ మ్యాప్‌లో తప్పుడు దారి చూపిస్తుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మ్యాప్‌లో మట్టి గుంతల రోడ్డు వైపు మేడారం, ఏటూరునాగారం, మణుగూరు తదితర ప్రాంతాలకు షార్ట్‌కట్ ఉందని చూపడంతో డ్రైవర్లు మ్యాప్ చూసి మట్టి రోడ్డు పట్టే డ్రైవర్లు అనుకూలమైన రహదారి కాకుండా మర్కోడు, రేగళ్ల గ్రామం మీదుగా వెళ్లే మట్టి రోడ్డునే జియో మ్యాప్ ప్రధాన మార్గంగా చూపిస్తుంది. దీంతో మేడారం, ఏటూరునాగారం, మణుగూరు వైపు వెళ్లే వాహనదారులు మ్యాప్ నమ్మి ఆ దారి ఎంచుకుంటున్నారు. కానీ అది పూర్తిగా మట్టి రోడ్డు కావడంతో గుంతలు, బురదతో నిండిపోయి ఉంది.

కార్లు, లారీలు, కూడా మ్యాప్ చూసి ఆ దారిలోకి వస్తున్నాయి. గుంతల్లో పడి వాహనాలు దెబ్బతింటున్నాయి. రాత్రి సమయంలో దారి తెలియక చిక్కుకుపోతున్నారు. "మ్యాప్ చూసి వచ్చాం, రోడ్డు లేదు, తిరిగి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నాం" అని డ్రైవర్‌లు వాపోతున్నారు. గ్రామస్తులకు ఇబ్బంది ఇరుకైన గ్రామ రోడ్డులో భారీ వాహనాలు రావడంతో గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణాలు సులువుగా సాగుతాయని పలువురు అంటున్నారు. మేడారం సమయంలో రహదారి గుంతలు పూడ్చిన, అది అప్పటి వరకే పని చేస్తుందని, వర్షాకాలం సమయంలో యధావిధిగా గుంతలు పడుతున్నాయని మండల వాసులు వాపోతున్నారు. వాహనదారులు మ్యాప్‌ను గుడ్డిగా నమ్మకుండా, స్థానికులను అడిగి మరీ ప్రయాణించాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.

Next Story