కూర్చొని గ్లామర్ షో చేస్తున్న హెబ్బా పటేల్.. చూపు తిప్పుకోలేని అందాలు

by Pulgam srinivas |

హెబ్బా పటేల్ హాట్ లుక్స్.. యెల్లో శారీలో గ్లామర్ షో.

కూర్చొని గ్లామర్ షో చేస్తున్న హెబ్బా పటేల్.. చూపు తిప్పుకోలేని అందాలు
X

దిశ, వెబ్ డెస్క్: హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ 2014లో విడుదలైన ‘తిరుమనం ఎనుం నిఖా’ అనే తమిళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.



అయితే ఆమె నటించిన కన్నడ చిత్రం ‘అధ్యక్ష’ ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఏడాది ‘అలా ఎలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా, 2015లో విడుదలైన ‘కుమారి 21ఎఫ్’ మూవీతో ఒక్కసారిగా భారీ గుర్తింపును సంపాదించుకుంది.




ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘రెడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసింది. హెబ్బా సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ షోతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.




తాజాగా హెబ్బా పటేల్ లైట్ యెల్లో కలర్ శారీలో స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, స్టైలిష్‌గా కుర్చీలో కూర్చొని తన అందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు పోజులు ఇచ్చింది.




ఒక చేతికి స్టైలిష్ బ్రాస్‌లెట్, పెద్ద ఇయర్ రింగ్స్ ధరించడం ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అలాగే కురులను కొంత వెనక్కి, మరికొంత ముందుకు పడేలా సెట్ చేసుకొని మరింత ఆకర్షణీయంగా కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోల్లో హెబ్బా హాట్ లుక్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story