- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బారైక్ రాజీనామా!
తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రమైంది. సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ ల తర్వాత టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బారైక్ కూడా రాజీనామా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన టీఎంసీ పార్టీకి, మాజీ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)కి ఆ రాష్ట్రంలో వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఎటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. వివిధ పరిణామాల తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు ఇప్పుడు పార్లమెంట్ స్థానాల వరకు విస్తరించాయి. టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బారైక్ (Prakash Chik Baraik) గురువారం తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఒకే వారంలో ఇలా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మూడో టీఎంసీ ఎంపీ కావడం గమనార్హం.
వరుస రాజీనామాలతో కుంచించుకుపోతున్న తృణమూల్ బలం..
ఈ వారంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ లు కూడా తమ పదవులకు, పార్టీకి రాజీనామా సమర్పించారు. తాజాగా ప్రకాష్ చిక్ బారైక్ సైతం వైదొలగడంతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల సంఖ్య కేవలం 10 కి పడిపోయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 58 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు చేసి రెబల్ గ్రూపుగా మారిన నేపథ్యంలో, ఈ ప్రభావం ఎంపీలపై కూడా తీవ్రంగా పడింది. వచ్చే వారం రోజుల్లో మరో ముగ్గురు టీఎంసీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ వరుస పరిణామాలు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ పార్టీని విలీనం చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.






