- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం.. మీనాక్షి నటరాజన్ పిటిషన్‍పై సుప్రీం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఏఐసీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు సుప్పీంకోర్టు అంగీకరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‍ను తిరస్కరణకు గురికావడంపై ఏఐసీసీ దాఖలు చేసిన పిటిషన్‍ను సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రేపు ఈ పిటిషన్‍పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. అయితే ఈ పిటిషన్ పై తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. మధ్యప్రదేశ్‍లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మీనాక్షి నటరాజన్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలో నమోదైన ఓ కేసుకు సంబంధిచిన విషయాన్ని మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్‍లో పేర్కొనలేదని ఆరోపిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‍ను తిరస్కరించారు. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ నేతలంతా కలిసి ఆందోళకు దిగారు. ఎన్నికల కమిషన్ సాయంతో బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పుతోందని వారంతా ఆరోపిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులు ప్రభావితం అయ్యారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారిస్తామని తెలిపింది. మరి రేపు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.






