మరోసారి పూజా హెగ్డేకు షాక్.. ఆశలన్నీ గల్లంతు

by Pulgam srinivas |

‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ద్వారా కూడా పూజ హెగ్డేకి నిరాశనే మిగిలే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోసారి పూజా హెగ్డేకు షాక్.. ఆశలన్నీ గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న పూజా హెగ్డే, ప్రస్తుతం వరుస పరాజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తోంది. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోవడం లేదు. తాజాగా పూజా హెగ్డే, వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై పూజా హెగ్డే భారీ ఆశలు పెట్టుకోవడంతో పాటు ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంది.

అయితే జూన్ 5న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గొప్ప టాక్ రాకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోగా, వీక్‌డేస్‌లో మరింత పేలవమైన కలెక్షన్లు నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకు మరోసారి నిరాశే ఎదురైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్‌కూ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story