ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి నివాసంతో పాటు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కాం నేటికి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసాలను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఆరుగురి ఇళ్లలో సైతం ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

3,500 కోట్ల నిధుల మళ్లింపుపై ఆరా..

గతంలో ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దాఖలు చేసిన నివేదికల ఆధారంగా ఈడీ ఈ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సుమారు ₹3,500 కోట్ల అవినీతి సొమ్మును బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, మరియు హవాలా నెట్‌వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లోకి మళ్లించారనే బలమైన అనుమానాలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో కీలక డిజిటల్ డివైజ్‌లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు, మరియు భారీ ఆస్తుల డైవర్షన్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఈడీ నుంచి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Next Story