హౌస్ వైఫ్‌ల సేవలను కనీసం రూ.30 వేల ఆదాయంగా పరిగణించాలి: సుప్రీంకోర్టు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-11 07:11:28  IST  )

హౌస్ వైఫ్‌ల సేవలను కనీసం రూ.30వేల ఆదాయంగా పరిగణించాలి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణి బాధితురాలిగా ఉన్న‌రోడ్డు ప్ర‌మాద కేసుకు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారం గురించి చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.

హౌస్ వైఫ్‌ల సేవలను కనీసం రూ.30 వేల ఆదాయంగా పరిగణించాలి: సుప్రీంకోర్టు
X

దిశ‌, వెబ్ డెస్క్: హౌస్ వైఫ్‌ల సేవలను కనీసం రూ.30వేల ఆదాయంగా పరిగణించాలి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణి బాధితురాలిగా ఉన్న‌రోడ్డు ప్ర‌మాద కేసుకు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారం గురించి చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ గృహిణులు ప‌డే క‌ష్టాన్ని ప్ర‌స్థావించింది. ఇంటిని న‌డిపే మ‌హిళ‌ల‌ను కేవ‌లం హౌస్ వైఫ్ అంటూ వ‌ర్ణించ‌డం వారి స‌హ‌కారాన్ని త‌క్కువ చేసి చూప‌డ‌మేన‌ని పేర్కొంది. వారి పాత్ర కేవ‌లం ఇంటి ప‌నుల‌కే ప‌రిమితం కాకుండా, కుటుంబాల‌ను తీర్చిదిద్ద‌డం, భ‌విష్య‌త్ త‌రాల‌ను పోషించ‌డం, దేశ నిర్మాణానికి దోహ‌ద‌ప‌డటం లాంటి అనేక అంశాల‌ను క‌లిగి ఉంటుంద‌ని తెలిపింది. హౌస్ వైఫ్స్ చేసే ఇంటి ప‌నులు, సంర‌క్ష‌ణ సేవ‌ల‌కు కాద‌న‌లేని ఆర్థిక విలువ ఉంద‌ని, భ‌విష్య‌త్ త‌రాల‌ను పెంచ‌డంలో, కుటుంబాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో, మాన‌వ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌టంలో అవి కీల‌క‌పాత్ర పోషిస్తాయ‌ని వెల్ల‌డించింది. కాబ‌ట్టి ఆమెను హౌస్ వైఫ్ అని కాకుండా దేశ నిర్మాత అని పిల‌వాల‌ని సూచించింది. ఇంట్లో మ‌హిళ చేసే ప‌ని ప్ర‌భావం నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం కాద‌ని నొక్కి చెప్పింది.

ప్ర‌మాద ప‌రిహారం కొసం కొత్త నియ‌మం

రోడ్డు ప్ర‌మాదాల్లో గృహిణులు ప్ర‌మాదానికి గురైతే న‌ష్ట‌ప‌రిహారం నిర్ణ‌యించడానికి సుప్రీంకోర్టు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. న‌ష్ట ప‌రిహారాన్ని కేవ‌లం ఆర్థిక న‌ష్టం యొక్క సంకుచిత అంచనాకు ప‌రిమితం చేయ‌కూడ‌ద‌ని, కుటుంబం కోల్పోయిన గృహ సంరక్షణ, సేవ‌ల విలువ‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది. దీనిని ప‌రిష్క‌రించేందుకు గృహ సంర‌క్ష‌ణ న‌ష్టం విలువ‌ను నెల‌కు రూ.30వేలుగా నిర్ణ‌యించింది.

Next Story