ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఆటో డ్రైవర్

by Batti.Sumithra |

సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ ఆటో డ్రైవర్ గత తొమ్మిది రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఆటో డ్రైవర్
X

దిశ, చంపాపేట్ : సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ ఆటో డ్రైవర్ గత తొమ్మిది రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫతేషా నగర్, మోయిన్‌బాగ్ ప్రాంతానికి చెందిన షేక్ దావూద్ (45) ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన దావూద్ ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు ఉండగా, మధ్యస్థ చర్మ వర్ణం, అండాకార ముఖం, నలుపు కళ్లతో ఉంటాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఎరుపు రంగు టీ-షర్ట్, బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి తెలుగు, ఉర్దూ భాషలు తెలుసు. దావూద్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేరవేయవచ్చని పేర్కొన్నారు.

సంప్రదించవలసిన నంబర్లు : 8712661296, 8712661023

Next Story