- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు కోడి కూర కోసం వివాదం.. కొడుకు చేతిలో తండ్రి హతం
నాటుకోడి కూర వివాదం ఓ కుటంబంలో తీరని విషాదాన్ని నింపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితంలో భారీ మూల్యాన్నే చెల్లించుకునేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఘటనలో ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నాటుకోడి కూర కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు తండ్రి ప్రాణం తీసింది. జనగామ (Jangaon) జిల్లా తరిగొప్పుల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జంగిలి రమేశ్ (42), అనుషా భార్యభర్తలు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో నాటు కోడిని తీసుకువచ్చి కోస్తాను కూర వండమని భార్య అనుషను అడిగాడు. అందుకు ఆమె ఇవాళ అంగట్లో చేపలు తీసుకువచ్చి వాండాననని, కోడిని రేపు ఉదయం కోసుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే భార్య మాటలకు ఆగ్రహంతో రగిలిపోయిన రమేశ్ అనూషను బూతులు తిట్టసాగాడు.
అమ్మను తిట్టొద్దని అడ్డుకునే క్రమంలో...
ఈ క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావంటూ ఇంట్లో ఉన్న కొడుకు గణేశ్ తండ్రికి అడ్డుతగిలాడు. దీంతో కొడుకును సైతం రమేశ్ తిట్టడంతో తండ్రి మాటలతో ఆగ్రహావేశానికి లోనైన గణేశ్ పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా బాదాడు. ఈ ఘటన తీవ్రంగా గాయపడిన రమేశ్ ను స్థానికులు జనగామ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






