ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం: కవిత

by Ajay Maddhiboyina |

ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్ లో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ను ఆమె ఆవిష్కిరంచారు.

ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం: కవిత
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్ లో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ను ఆమె ఆవిష్కిరంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జులై 2న ఉప్పల్ భగాయత్ భూములను భూపోరాటం ద్వారా ఆక్రమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలపారు. అది అక్రమం కాదని సక్రమమేనని అన్నారు. ఈ భూమి ఉద్యమకారులదేనని, భూమి కోసం కొట్లాడింది తామే అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసమే ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు హైదరాబాద్ కు తరలిరావాలని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ వాదంపై దాడులు చేస్తూ, అనేక రకాల శక్తులు, వ్యక్తులు ఉద్యమ స్పూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరి కర్తవ్యంగా భావించి మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

Next Story