ఆర్మూర్‌లో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

by Batti.Sumithra |

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో, కెనాల్ కట్ట సమీపంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందింది.

ఆర్మూర్‌లో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో, కెనాల్ కట్ట సమీపంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుంచెపు ఎల్లమ్మ (37) ఇంట్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురైంది. బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో నీళ్లు తాగేందుకు లేచి వంటగది వైపు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇనుప తలుపుపై కట్ అయిన విద్యుత్ తీగ పడిఉండటాన్ని గమనించకుండా తలుపును తాకడంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కాలనీవాసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఎల్లమ్మ మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Next Story