- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ వ్యూహాత్మక ‘హర్ముజ్ జలసంధి’ని మూసివేయడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ రగులుతున్న సైనిక ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. ఇరాన్‌పై అమెరికా తాజా వైమానిక దాడులకు దిగడంతో, దానికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి చేసింది. అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) ను ఇరాన్ సైన్యం పూర్తిగా మూసివేస్తున్నట్లు గురువారం (జూన్ 11) అధికారికంగా ప్రకటించింది. ఈ మార్గం గుండా వెళ్లే ఏ రకమైన చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలనైనా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) సరఫరాకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్..
ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర మార్గ చమురు రవాణాలో దాదాపు 25 శాతం వాటా ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కాల్పుల విరమణ తర్వాత భారీగా తగ్గిన ధరలు.. తాజా పరిస్థితులతో గంటల వ్యవధిలోనే రెండు శాతం పెరిగాయి. దీంతో భారత్ వంటి దేశాలపై మరోసారి తీవ్ర ప్రభావం పడింది. కాగా ఈ పరిణామాలతో మరోసారి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం.. పతనమైన రూపాయి
మధ్యప్రాచ్యంలో (Middle East) మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ ఆందోళనల నేపథ్యంలో గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 300, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీలు 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు (Profit Booking) మొగ్గు చూపడంతో మార్కెట్లు రక్తసిక్తమయ్యాయి. మరోవైపు, గ్లోబల్ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడం, చమురు ధరల భారంతో భారత రూపాయి విలువ మరింత క్షీణించింది. తాజా ఫారెక్స్ మార్కెట్ పరిస్థితుల ప్రకారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో 30 పైసలు నష్టపోయి చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది.






