- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముల్కనూరులో ఆర్టీఏ ఆకస్మిక తనిఖీలు
రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న వాణిజ్య వాహనాల పై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది.

దిశ, భీమదేవరపల్లి : రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న వాణిజ్య వాహనాల పై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక విజిలెన్స్ డ్రైవ్‌లో భాగంగా గురువారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారి పై ప్రత్యేక బృందాలు మోహరించి లారీలు, గూడ్స్ వాహనాలు, ఇతర వాణిజ్య వాహనాల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన వాహనాలు, బీమా, పర్మిట్ నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా ఏఎంవీఐ అపర్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపర్చడం, పన్నుల ఎగవేతను అరికట్టడం, ఫిట్‌నెస్ లేని వాహనాల సంచారాన్ని నియంత్రించడమే ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వాణిజ్య వాహన యజమానులు త్రైమాసిక పన్నులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బీమా, పర్మిట్లు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఇటీవల రహదారి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల ప్రాణ భద్రతతో రాజీపడే పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. ఫిట్‌నెస్ లేకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకువచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జీఎంవీఐ వేణుగోపాల్, ఎంవీఐ శ్రావ్య, హోంగార్డులు శ్రీధర్, నరేందర్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక విజిలెన్స్ డ్రైవ్‌లో భాగంగా ముల్కనూరులో నిర్వహించిన ఈ తనిఖీలు వాణిజ్య వాహన యజమానుల్లో అప్రమత్తత పెంచాయి. పన్నులు, ఫిట్‌నెస్, పర్మిట్, బీమా తదితర పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని అధికారులు సూచించారు.






