- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలోని సోనోవిజన్ లో భారీ చోరీ
by Batti.Sumithra |
ఖమ్మం నగరంలో వైరా రోడ్డులో గల సోనోవిజన్ ఎలక్ట్రానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు.

X
దిశ, ఖమ్మం క్రైం : ఖమ్మం నగరంలో వైరా రోడ్డులో గల సోనోవిజన్ ఎలక్ట్రానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే వైరా రోడ్డులో ప్రధాన రహదారికి పక్కన గల సోనోవిజన్ షాప్ లో షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. షాప్ లో దాదాపు 70 లక్షల మేర సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు షాపు యాజమాన్యం పేర్కొంటుంది. దాదాపు పది ఐఫోన్లు సాంసంగ్, వివో, ఒప్పో లాంటి 150 ఫోన్ లకు పైగా పోయినట్లు తెలుస్తుంది. దుండగులు మాస్కల్, గ్లోజులు ధరించి రాత్రి సమయంలో ఓ కారులోవచ్చి చోరీకి పాల్పడిన దుండగులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. షాప్ లోపల ఉన్న సీసీ ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ నగరంలో ప్రధాన రహదారి పై జరిగిన ఈ సంఘటనతో నగరవాసులు ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు.
Next Story






