భారీ పేలుడు.. 15 మంది దుర్మరణం, 15 మందికి తీవ్ర గాయాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-01 09:32:24  IST  )

నాగ్‌పూర్ సమీపంలోని ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడగా, ఐదుగురు మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

భారీ పేలుడు.. 15 మంది దుర్మరణం, 15 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన మరువక ముందే మరో రాష్ట్రంలో భారీ పేలుడు (Huge explosion) సంభవించి 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో కటోల్ ఉన్న బాణాసంచా కర్మాగారం (Fireworks factory)లో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి పోయింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి (15 people died) చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణలతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారీ పేలుడులో 17 కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం దిగ్బ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Next Story