‘అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తాం’

by GSrikanth |

బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకుగా ముదిరాజులను వాడుకునే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

‘అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో బీఆర్ఎస్‌కు చూపిస్తాం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకుగా ముదిరాజులను వాడుకునే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్‌ల సత్తా చాటుతామన్నారు. హైదరాబాదులోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముదిరాజ్‌ల మేనిఫెస్టో‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముదిరాజ్‌లు 60 లక్షల మంది ఉన్నారని, అయినా కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు సైతం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

రాజకీయ పార్టీలు ముదిరాజ్‌ల మధ్య వైరం పెట్టి కులాన్ని విడగొట్టి ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, వెయ్యికోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించాలని, ముదిరాజ్ మహిళా సాధికారత కోసం పాటు పడాలని, ముదిరాజ్‌ల చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం ఒక ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కురుమూర్తి, బ్రమెంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి ఉదయ్, రాష్ట్ర మహిళా నాయకురాలు ప్రేమలత, రాష్ట్ర సెక్రటరీ నర్సింహ, సురేష్, వెంకటేష్, నరేష్, వెంకటేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Next Story