- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు.. వివాదానికి చెక్ పెట్టిన కిరణ్ అబ్బవరం
‘అబ్సెషన్’ అనేది ఒక గ్లోబల్ స్థాయి సినిమా అని, ఎంతో గొప్ప ప్రమాణాలతో తెరకెక్కిన ఆ చిత్రాన్ని తన సొంత ప్రాజెక్ట్ అయిన ‘కె రాంప్’ తో పోల్చే ఉద్దేశం, ఆలోచన తనకు అస్సలు లేవని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.. రవి నంబూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామా జూలై 24న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం చేసిన పలు వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘అబ్సెషన్’ సినిమా గురించి మాట్లాడుతూ.. "మనం రాత్రింబవళ్లు కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తుంటే.. వాళ్లేమో కేవలం ఒకే ఒక అబ్సెషన్ పిచ్చి/వ్యామోహం అనే పాయింట్‌తో గ్లోబల్ రేంజ్‌లో సినిమా తీసేస్తున్నారు. మన కష్టానికి విలువ లేదా?" అనేలా సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. ఈ వివాదంపై కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. తాను ఆ మాటలను కేవలం ఫన్నీగా, నవ్వులాటకే అన్నానని అంతేకానీ ఆ సినిమాను తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. కొంతమంది ఆ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని, సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాన్ని సృష్టించారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘అబ్సెషన్’ అనేది ఒక గ్లోబల్ స్థాయి సినిమా అని, ఎంతో గొప్ప ప్రమాణాలతో తెరకెక్కిన ఆ చిత్రాన్ని తన సొంత ప్రాజెక్ట్ అయిన ‘కె రాంప్’ తో పోల్చే ఉద్దేశం, ఆలోచన తనకు అస్సలు లేవని స్పష్టం చేశారు. ‘అబ్సెషన్’ సినిమా స్థాయి వేరని, దాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. తాను మాట్లాడిన పూర్తి విషయాన్ని పక్కన పెట్టి.. కేవలం కొన్ని మాటలను మాత్రమే సందర్భం నుంచి వేరు చేసి , సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ప్రచారం చేయడం తనను ఎంతగానో బాధించిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న విషయాలను కావాలనే పెద్దవి చేస్తూ, అనవసరమైన వివాదాలు సృష్టించడం మరియు నటీనటులపై నెగెటివిటీని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని, ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కిరణ్ స్పష్టం చేశారు.






