నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-23 13:47:45  IST  )

ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. పలువురు నటులు, నటీమణులు శివాజీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఇక శివాజీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్మండిపడింది. నటుడు చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తెలియజేశారు. మహిళలపై అసభ్యంగా ఎవరు మాట్లాడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా.. "చీర కట్టుకోవడంలో అందం ఉంటుంది, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం అందం కాదు. అలాంటివాళ్ళని చూస్తే దరిద్రపు ముండ అని తిట్టాలనిపిస్తుంది" అంటూ శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

READ MORE ....

మహిళలకు క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ.. ‘నా ఉద్దేశం మంచిదే’ అంటూ..

Next Story