మహిళలకు క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ.. ‘నా ఉద్దేశం మంచిదే’ అంటూ..

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-23 13:46:27  IST  )

మహిళలకు క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ.. ‘నా ఉద్దేశం మంచిదే’ అంటూ..

మహిళలకు క్షమాపణ చెప్పిన నటుడు శివాజీ.. ‘నా ఉద్దేశం మంచిదే’ అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: దండోరా సినిమా ఫంక్షన్‌లో నటుడు శివాజీ(Actor Shivaji) మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తాజాగా శివాజీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘‘నాలుగు మంచి మాటలు చెప్పాలని అనుకున్నాను.. ఈ క్రమంలోనే కొన్ని వాడకూడని పదాలు వాడాను.. ఆ మాటలు కూడా అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.. ముఖ్యంగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను.. ఇటీవల ఒకరిద్దరు హీరోయిన్లు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అభిమానులు వారిపట్ల మిస్ బిహేవ్ చేయడం, హీరోయిన్ల దుస్తులు కూడా చిరిగిపోయిన పరిస్థితులు మనం చూశాం. అందుకే అలా మాట్లాడాను.. ఏదేమైనా నా ప్రసంగంలో రెండు వాడకూడదని పదాలు వాడాను.. దానికి క్షమాపణ చెబుతున్నాను. నేను మహిళలను అమ్మవారిలా చూస్తాను.. స్త్రీలను ఎవరూ తక్కువగా చూడొద్దు.. చూసే అవకాశం వారు కూడా ఇవ్వొద్దు అనే ఉద్దేశంతో అలా చెప్పాను.. ఈ క్రమంలోనే రెండు వాడకూడని పదాలు వాడాను.. నా ఉద్దేశం మంచిదే కానీ.. సరైన పద్ధతిలో చెప్పలేకపోయాను.. ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే సారీ’’ అని శివాజీ వీడియోలో చెప్పుకొచ్చారు.

READ MORE ....

నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్

Next Story