కాసేపట్లో బండి భగీరథ్ విచారణ.. హాజరయ్యేనా?

by Jakkula.Mamatha |   (  Updated:2026-05-13 10:21:35  IST  )

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్‌ను విచారణ నిమిత్తం తమ ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ అతని మేనమామ సీహెచ్ వంశీకృష్ణకు పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

కాసేపట్లో బండి భగీరథ్ విచారణ.. హాజరయ్యేనా?
X

దిశ,తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్‌ను విచారణ నిమిత్తం తమ ముందు ప్రవేశపెట్టాలని కోరుతూ అతని మేనమామ సీహెచ్ వంశీకృష్ణకు పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం 2 గంటల లోపు సాయి భగీరథ్‌తో కలిసి విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఒకవేళ నోటీసులను ధిక్కరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినప్పటికీ, విచారణలో బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత సెక్షన్లను మార్చారు. ప్రస్తుతం ఈ కేసులో పోక్సో సెక్షన్ తీవ్రస్థాయి లైంగిక దాడి కింద అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలోనే కేసు తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, సాయి భగీరథ్‌కు మేనమామ కావడంతో ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. దర్యాప్తులో భాగంగా సాయి భగీరథ్‌ను విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే ఆయన బాధ్యత తీసుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని ఇన్ స్పెక్టర్ తన నోటీసులో పేర్కొన్నారు.

సిట్ విచారణకు బండి సంజయ్ కొడుకు డుమ్మా!

Next Story