- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డిపై ఏ కేసు పెట్టాలి? కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు
తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణలు కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్యారెంటీ హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు. హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్ల వేయించుకుని ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను పిక్ పాకెటింగ్ చేస్తున్నారని ఇలా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఏ కేసు పెట్టాలని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన ఆమె లోక్‍సభలో రాహుల్ గాంధీ తీరు సరిగా లేదన్నారు. మహిళా రిజర్వేషన్స్, డీలిమిటేషన్ బిల్లులు వీగిపోతే ఇండియా కూటమి సంబరాలు చేసుకున్నారంటే మీ ఉద్దేశం ఈ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశంగా విచ్చిన్నం చేయడమేనని ధ్వజమెత్తారు.
తేజస్వీ వ్యాఖ్యలపై..
తనకు మరో గంట అవకాశం ఇస్తే ప్రతి రాష్ట్రానికి అదనంగా 50 సీట్లు అదనంగా కేటాయిస్తూ బిల్లును తీసుకువస్తానని సభలోనే అమిత్ షా కోరినా విపక్షాలు ఎందుకు అంగీకరించలేదని నిలదీశారు. జనాభా లెక్కలతో బాటు కులగణన చేస్తున్నామని ఈ లెక్కలన్ని 2031 వరకు సమగ్రంగా వస్తాయన్నారు. 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు, దక్షిణ భారత దేశంలో లోక్ సభ సీట్లు పెంచాలనే ఉద్దేశంతో మోడీ ఈ బిల్లును తీసుకు వచ్చారన్నారు. తేజస్వి వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలన్నారు. అవమానించే ఉద్దేశంతో తేజస్వి ఆ వ్యాఖ్యలు చేయలేదు.






