- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పక్కా అధికారంలోకి వస్తాం.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గర్జించారు. బెంగాల్‌లో బీజేపీ సాధించిన అఖండ విజయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: బెంగాల్ విజయోత్సాహం.. తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇవాళ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఇవాళ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
బెంగాల్ విజయంపై హర్షం..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రక విజయం గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘తాను నిన్న బెంగాల్‌లోనే ఉన్నాను. అక్కడ మన పార్టీ అఖండ ప్రచండ విజయం సాధించింది. బీజేపీకి చెందిన నేత తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మనందరికీ గర్వకారణం’ అని గుర్తు చేశారు. బెంగాల్ విజయం తాలూకు ఆ విజయోత్సాహం ఇవాళ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలోనూ స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ మార్పు కోరుకుంటున్నారు..
అసోంలో బీజేపీ వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, పుదుచ్చేరిలో ఎన్డీయే (NDA) రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల గెలుపోటములపై చర్చ జరుగుతున్నా, బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయం అత్యంత విశిష్టమైనదని, అది రాష్ట్రంలోని బానిస సంకెళ్లను తెంచివేసిందని ఆయన అభివర్ణించారు. ఇదే క్రమంలో తెలంగాణలోనూ రాజకీయ మార్పును ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలనే మాట ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ..
బీజేపీని బెంగాల్ ప్రజలు ఆశీర్వదించినట్లుగానే.. తెలంగాణలోనూ ఆశీర్వదించాలని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గెలిచామని, తర్వాత బీజేపీ లక్ష్యం తెలంగాణే అని పేర్కొన్నారు. ఇక్కడి కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్ నినాదం’ వినిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతోందని ఫైర్ అయ్యారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని అన్నారు. మమత నియంతృత్వాన్ని బెంగాల్ ప్రజలు ఎదరించారని ప్రధాని మోడీ అన్నారు.






