అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-14 11:15:39  IST  )

NTV జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అర్థ రాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూ జే తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థ గాని నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే
X

దిశ, వెబ్ డెస్క్: NTV జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అర్థ రాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూ జే తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థ గాని నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. కానీ ఇలా అర్థరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడం స‌రికాద‌ని పేర్కొంది. ఈ ముగ్గురూ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులని, వీరి అరెస్టును ఖండిస్తున్నామ‌ని తెలిపింది. ఇదే సమయంలో జర్నలిస్టులకు సంఘం తరఫున ఒక సూచన చేసింది.

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం చేయ‌డం గానీ, ప్రచురించడం గానీ చేయ‌వ‌ద్ద‌ని సూచించింది. ఆధారాలు ఉంటేనే వార్తలు వేయాలని, ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్త కథనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలదేనని స్ప‌ష్టం చేసింది. ఏది ఏమైనా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అర్ధరాత్రి పూట తీవ్రవాదుల్లా అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని తెలిపింది. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని టీయూడ‌బ్ల్యూజే డిమాండ్ చేసింది.

Read More : అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి

Next Story