- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలింపు
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు.

దిశ, వరంగల్ బ్యూరో : నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్న శంకర్ నర్సంపేట డిపో వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మొదట నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు ప్రభుత్వ సూచనల మేరకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఆయనను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో భాగంగా ఆత్మహత్యయత్నం చేసిన శంకర్ శరీరం ఎక్కువగా కాలిపోయింది. తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంజీఎంలో పరామర్శించిన కలెక్టర్, సీపీ ఆర్టీసీ కార్మికుడు శంకర్ ను ఎంజీఎం ఆసుపత్రిలో కలెక్టర్ సత్యశారధ, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పరామర్శించారు. వైద్యులతో చర్చించారు. పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలెక్టర్, సీపీలతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మికుడిని ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలించారు. వరంగల్ ఎంజీఎం కన్న నిమ్స్ లో మెరుగైన సౌకర్యాలు ఉండటం, అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండటం వల్ల తరలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యశారధ మీడియాకు తెలిపారు. కార్మికుడికి మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రత్యేక వాహనం ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు సమన్వయం పాటించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవదన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మికులు సమయం పాటించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు.
ఎంజీఎం వద్ద ఉద్రిక్తత, భారీ భద్రత
ఆర్టీసీ కార్మికుడిని చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకురావడంతో భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. అతన్ని చూసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తుండటంతో ఎవరిని లోపలికి అనుమతించలేదు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర నేతలు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. కార్మికులకు పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. ఎవరై అధైర్యపడవద్దని సమన్వయం పాటించాలన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా మంత్రులు కూడా చొరవ తీసుకోవాలని కోరారు.






