‘ప్రాణాలు కాదు, పరిష్కారం కావాలి’.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు

by Ramesh Naini |   (  Updated:2026-04-23 15:26:24  IST  )

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో, ఉద్వేగానికి గురై ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్ళటం అత్యంత బాధాకరం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) ఆవేదన వ్యక్తం చేశారు.

‘ప్రాణాలు కాదు, పరిష్కారం కావాలి’.. ఆర్టీసీ కార్మికులకు విజయశాంతి పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో, ఉద్వేగానికి గురై ఆత్మహత్య ప్రయత్నాలకు వెళ్ళటం అత్యంత బాధాకరం అని సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అమరులు తమ పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నది తిరిగి సమస్యలతో ఆత్మబలిదానాల కోసం కాదు.. అని పేర్కొన్నారు. కార్మిక సోదరులారా, తెలంగాణ బిడ్డలైన మీలో ఏ ఒక్కరు ఈ విధమైన దుఃఖానికి గురైనా తెలంగాణ సమాజం మొత్తం కలతతో ఎంతైనా బాధపడతది.. దయచేసి ఏ ఒక్కరు ఏ విధమైన ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చేతులెత్తి మొక్కి చెబుతున్నాను.. అని పిలుపునిచ్చారు. ఆత్మాహుతికి పాల్పడ్డ నర్సంపేట సోదరుడు శంకర్ గౌడ్ కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రభుత్వానికి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నదని విజయశాంతి తెలియజేశారు.

Read More.. ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలింపు

Next Story