- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిన బస్సులు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జాక్ సమ్మెకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఆర్టీసీ డిపోల్లో 1036 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జాక్ సమ్మెకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఆర్టీసీ డిపోల్లో 1036 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మెలో వరంగల్ రీజియన్ పరిధిలో 1332 మంది కండక్టర్లు, 1100 మంది డ్రైవర్లు పాల్గొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జాక్ చైర్మన్ యాకస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు అపాయింట్మెంట్ డేట్ ప్రకటించి కార్మికుల ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదు అని అన్నారు.
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రోజువారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Next Story






