ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రోజువారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by Batti.Sumithra |   (  Updated:2026-04-22 07:04:39  IST  )

ఆర్టీసీలో ఉద్యోగస్తులు సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీలో రోజువారి వేతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది.

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రోజువారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఖమ్మం : ఆర్టీసీలో ఉద్యోగస్తులు సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీలో రోజువారి వేతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 డిపోల పరిధిలోని కండక్టర్ పోస్ట్ కోసం రీజనల్ మేనేజర్ సరిరామ్ ప్రకటన విడుదల చేశారు‌. పదవ తరగతి పాసై ఉంటే వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు డిపో మేనేజర్లకు అందించాలన్నారు. డిపో మేనేజర్లు టీమ్స్ మిషన్ అవగాహన కల్పించి రూట్లలో పంపిస్తారన్నారు. దాంతో పాటు డ్రైవర్ల కోసం కనీస విద్యార్హత కలిగి 18 నెలల డ్రైవింగ్ పై అనుభవం ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రోజుకి కండక్టర్లకు రూ.800, డ్రైవర్ కి రూ.వేయి రూపాయలు వేతనం ఇస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆయా డిపో మేనేజర్లను సంప్రదించాలని కోరారు.

ఆగిన బస్సులు.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Next Story