- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటుకు వేళాయే.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలివెళ్లారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వంద శాతం పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లను చేశారు.
12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు..
ఉమ్మడి జిల్లా పరిధిలో నేడు భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, వర్ధన్నపేట, తొర్రూర్, స్టేషన్ ఘన్పూర్, జనగామ మున్సిపాలిటీల పరిధిలో నేడు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటు వేయనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పాటు పోలింగ్ కు కావలసిన సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల పరిధిలో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలుతో పాటు ఇతర సిబ్బందిని నియమించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైక్రో అబ్జర్వర్లు, నోడల్ అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనికి ఓటర్లు మినహా ఎవరిని అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు.
కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు..
మున్సిపాలిటీలో వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. 18 గుర్తింపు కార్డుల ద్వారా ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, రేషన్ కార్డుతో పాటు పలు ప్రభుత్వంచే జారీ చేయబడిన కార్డులను తీసుకువస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ప్రతి మున్సిపాలిటీల పరిధిలో గ్రీన్ పోలింగ్ కేంద్రాలను కూడా ఒకటి ఏర్పాటు చేశారు.
పోలీస్ బందోబస్తు..
పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ ను విధించారు. ఆ కేంద్రాల వద్ద గుంపు కానీ, ఎక్కువ మంది గుమ్మిగూడవద్దని పోలీసులు ఆదేశించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఏసీపీ స్థాయి అధికారిని బందోబస్తు కోసం నియమించారు.






